శైలాజారెడ్డి అల్లుడి ఫస్ట్ లుక్
BY Telugu Gateway9 July 2018 8:22 AM GMT

X
Telugu Gateway9 July 2018 8:22 AM GMT
అత్తా..కూతురు...అల్లుడు ఒకే స్టిల్. అదే శైలజారెడ్డి అల్లుడి ఫస్ట్ లుక్. ఆ అత్త రమ్యకృష్ణ అయితే...అల్లుడిగా అక్కినేని నాగచైతన్య, కూతురుగా అను ఇమ్మాన్యుయల్ నటిస్తున్నారు. గత కొంత కాలంగా హిట్స్ తో దూసుకెళుతున్న దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో దీనిపై కూడా భారీ అంచనాలే ఏర్పడుతున్నాయి. ఫస్ట్ లుక్ లో నాగచైతన్య డిఫరెంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి సన్నాహాలు చేస్తున్నారు.
Next Story