Telugu Gateway
Cinema

‘ఉగాది’కి మహేష్ సందడి

‘ఉగాది’కి మహేష్ సందడి
X

టాలీవుడ్ హీరోలందరికీ సెంటిమెంట్లు ఎక్కువ. కొంత మంది హీరోలు తమ సినిమాలను ఖచ్చితంగా ‘సంక్రాంతి’కే విడుదల చేయాలని చూస్తారు. అందుకనుగుణంగానే ప్లాన్ చేసుకుంటారు. మరి కొంత మందికి దసరా సెంటిమెంట్. అయితే ప్రతి పెద్ద పండగకు పెద్ద హీరోల సినిమాలు మాత్రం పక్కా. ఇప్పటి నుంచే వచ్చే ఏడాది సినిమాలు కూడా ప్లాన్ చేస్తారు. టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక 25వ సినిమాను వచ్చే ఉగాదికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే పేరు పెట్టని ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా పరాజయాల బాటలో ఉన్న మహేష్ కు ‘భరత్ అనే నేను’ సినిమా మంచి హిట్ నిచ్చింది. ఈ ఊపుతోనే మహేష్ బాబు తన 25వ సినిమాకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రడూన్ లో జరుగుతోంది. సుమారు నెల రోజుల పాటు అక్కడే షూటింగ్ పనుల్లో చిత్ర యూనిట్ ఉండబోతోంది.

Next Story
Share it