Telugu Gateway
Cinema

శ్రీరెడ్డి ఆరోపణలపై కాజల్ వ్యాఖ్యలు

శ్రీరెడ్డి ఆరోపణలపై కాజల్  వ్యాఖ్యలు
X

టాలీవుడ్ ను గత కొంత కాలంగా శ్రీరెడ్డి షేక్ చేస్తోంది. తాను చేసిన ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలకు టాప్ హీరోలతోపాటు..హీరోయిన్లు కూడా బాధితులుగా మారుతున్నారు. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లు అయిన రకుల్, సమంత, కాజల్ లు కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని..ఈ విషయాలన్నీ వెల్లడైతే అందరూ షాక్ కు గురవుతారంటూ ఓ వ్యాఖ్య చేశారు. అయితే ఈ అంశంపై హీరోయిన్ కాజల్ స్పందించారు.

శ్రీరెడ్డి ఆరోపణలను తోసిపుచ్చారు. తాను పరిశ్రమలో ఎలాంటి వేధింపులను ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించటం విశేషం. అదే సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రతి దానికి అమ్మాయిలను టార్గెట్ చేసే బదులు వారితో ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పిస్తే బెటర్ అని కాజల్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it