Telugu Gateway
Movie reviews

‘హ్యాపీవెడ్డింగ్’ మూవీ రివ్యూ

‘హ్యాపీవెడ్డింగ్’ మూవీ రివ్యూ
X

‘ఓ అమ్మాయి పెళ్ళి అయితే ఇంట్లో ఫ్రిజ్ ...టీవీ, వాషింగ్ మెషీన్ లా పడి ఉండాల్సిందేనా?. ఆమె భావోద్వేగాలు...ఆలోచనలు ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదా?. ప్రేమలో ఉన్న తొలిరోజుల్లో అమ్మాయి పట్ల ఎంతో కేరింగ్ గా ఉండే అబ్బాయిలు..పెళ్ళి ఫిక్స్ అయిపోగానే లైట్ తీసుకుంటారా?. తీసుకుంటే ఆ అమ్మాయి పడే టెన్షన్ ఎలా ఉంటుంది. అమ్మాయిలకేనా పెళ్లి అంటే భయం?. అబ్బాయిలకు అలాంటివి ఏమీ ఉండవని అమ్మాయిలు అనుకుంటారా?. ఎలాంటి భార్య వస్తదో...వచ్చిన అమ్మాయి తన తల్లిదండ్రులతో కలసి మంచిగా ఉంటుందో లేదో అన్న భయం అబ్బాయిలకు ఉండదా?. అటు అమ్మాయి అయినా...అబ్బాయి అయినా ఎవరి కోణంలో వారే ఆలోచిస్తారా?. ఇలాంటి సన్నివేశాలు...సంఘర్షణలు...సర్దుబాట్లు..అంతిమంగా హ్యాపీగా పెళ్లికి రెడీ అవటం ఇదే..హ్యాపీవెడ్డింగ్ సినిమా.

చాలా గ్యాప్ తర్వాత సుమంత అశ్విన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నిహారికా కొణిదెల హీరోయిన్ గా చేసింది. సుమంత్ అశ్విన్ ఒకప్పటి ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం ఎస్ రాజు తనయుడు అయితే...నిహారిక నాగబాబు కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ సినీ వారసత్వం నుంచి వచ్చిన వారే. అయినా మంచి కథను ఎంచుకోవటంలో దెబ్బతిన్నారు. ప్రేక్షకులకు సినిమా అంతా ఓ షార్ట్ ఫిల్మ్ చూసినట్లు ఉంటుందే తప్ప...ఎక్కడా సినిమా ఫీల్ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే హ్యాపీ వెడ్డింగ్ సినిమా ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల సీట్లలో భారంగా గడపాల్సిందే. సినిమా బోరింగ్ ను తట్టుకోలేక కొన్ని డైలాగుల సమయంలో ప్రేక్షకుల కేకలు చూసి నవ్వుకోవాల్సిందే తప్ప...ఎక్కడా ఫీల్ ఉండవు.

ఈ సినిమాలో హీరో..హీరోయిన్ల తల్లిదండ్రుల పాత్రలు పోషించిన నరేష్, పవిత్ర లోకేష్, మురళీశర్మ, తులసీలవి రొటీన్ పాత్రలే. క్లైమాక్స్ లో అమ్మాయి మాటకు గౌరవం ఇచ్చి పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని చెప్పే సమయంలో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. తనను పట్టించుకోవటం లేదనే కారణంతో తొలుత ప్రేమించిన అబ్బాయిని వదులుకుని...మళ్ళీ ప్రేమలో పడిన అమ్మాయిగా నిహారిక తన పాత్రకు న్యాయం చేసింది. హీరో సుమంత్ నటనపరంగా మంచి పరిణితి చూపించినా.. కథలో ఫీల్ లేకవటంతో అంతా బోరింగ్, భారంగా ముందుకు సాగుతుంది. లక్ష్మణ్ కర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నట వారసులకు మరోసారి నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు.

రేటింగ్. 2/5

Next Story
Share it