Telugu Gateway
Cinema

విజయ్ దేవరకొండపై యాసిడ్ పోస్తానన్న హీరోయిన్

విజయ్ దేవరకొండపై యాసిడ్ పోస్తానన్న హీరోయిన్
X

ఇంత దారుణం ఏంటి అనుకుంటున్నారా?. అవును. నిజమే. కాకపోతే ఓ హీరోయిన్ తన హీరోకు ఇచ్చిన వార్నింగ్ ఇది. అమ్మాయిలు..ఆంటీలు, ఫిగర్లు అంటూ ఈ సారి అటుచూశావో మొహంపై యాసిడ్ పోస్తా అంటూ బెదిరిస్తోంది రష్మిక మందన. అయితే ఇది ‘గీత గోవిందం’ సినిమాలో మాత్రమే సుమా. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సోమవారం నాడు విడుదలైంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రచారంతో గీత గోవిందం సినిమాపై అంచనాలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ టీజర్ బ్లాక్ అండ్ వైట్ తో మొదలై కలర్ లోకి వెళుతుంది. ‘ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం నీదీ నాదీ’ అంటూ స్టార్ట్ అవుతుంది. చిలిపి సరదాలు..సంఘటనలతో ..ఇక మారవా అంటూ హీరోయిన్‌ డైలాగ్‌.. లేదు మేడం, ఐ యామ్‌ కంప్లీట్లీ డీసెంట్‌ నౌ అనడం నవ్వులు తెప్పిస్తుంది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించారు. టీజర్ విడుదలైన ఎనిమిది గంటల్లోనే ఇది 1.4 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పింది.ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను జూలై 29న విడుదల చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=OYK2eJ0oeg8

Next Story
Share it