స్పీడ్ పెంచిన సుధీర్ బాబు
BY Telugu Gateway29 Jun 2018 8:11 AM GMT

X
Telugu Gateway29 Jun 2018 8:11 AM GMT
హీరో సుధీర్ బాబులో జోష్ పెరిగింది. సమ్మోహనం సినిమా ఈ హీరోకు మాంచి కిక్ ఇచ్చింది. నిన్న మొన్నటి వరకూ ప్రేక్షకులను సమ్మోహనపర్చిన ఈ హీరో ఇప్పుడు ‘నన్ను దోచుకుందువటే’ అంటూ ముందుకొస్తున్నాడు. సుధీర్ బాబు కొత్త సినిమా టైటిల్ ఇదే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో..ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గులేభకావళి కథ చిత్రంలోని సూపర్ హిట్ పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. ఈ సినిమాను సుధీర్ బాబే స్వయంగా నిర్మిస్తున్నారు..తన సొంత బ్యానర్ లో. సుధీర్ బాబుకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది.
Next Story