పవన్ ఫ్యాన్స్ కు రేణూదేశాయ్ వార్నింగ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు రేణూ దేశాయ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆమె రెండో పెళ్లి సిద్ధమవుతుండగా...రేణూపై పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె రెండో పెళ్లిపై పవన్ కళ్యాణే ఇటీవలే అభినందనలు తెలిపారు. అయినా సరే పవన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపటం లేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రేణూ దేశాయ్ గట్టి వార్నింగ్ ఇఛ్చారు. విడాకుల వ్యవహారంపై ఇన్నాళ్లు తాను మౌనంగా ఉన్నానని, అలా ఉన్నందుకు పవన్ అభిమానులు కృతజ్ఞతగా ఉండాలన్నారు. మర్యాదగా ప్రవర్తించాలని, అలా కాకుండా విడాకుల వ్యవహారంపై తాను నోరు విప్పితే అభిమానుల పొగరు మురికి కాలువలో పడి కొట్టుకుపోతుందని ఆమె హెచ్చరించారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వరుసగా పోస్టులు పెట్టారు. ‘విడాకుల వెనక ఉన్న వాస్తవాలను చెబితే అవివేకులైన ఫ్యాన్స్ కు గర్వభంగం అవుతుంది’ అంటూ తీవ్రస్థాయిలో ఆమె వ్యాఖ్యానించారు. ‘పవన్ అభిమానుల్లో చాలా మంది మర్యాదస్తులు, మంచివాళ్లు ఉన్నప్పటికీ, కొందరు(ఓ 10 శాతం) మాత్రం అవివేకులే. నెగిటివిటీని భరించాల్సిన అవసరం నాకు లేదు. అసలు నేనేం చేశానని వాటిని భరించాలి?’ అని రేణూదే:శాయ్ ప్రశ్నించారు. దయచేసి సలహాలు ఇవ్వడం మానుకోవాలని.. ఇక నుంచైనా తనను టార్గెట్ చేయకపోవటమే మంచిందని ఆమె హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనతో ఏడుపుగొట్టు కథలు చెప్పుకోవడం మానుకుంటే మంచిదన్నారు.