రేణూదేశాయ్ కు ‘పవన్ శుభాకాంక్షలు’

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న రేణూ దేశాయ్ కు హీరో పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన రేణూ దేశాయ్ కు మంచి జరగాలని..భవిష్యత్ అంతా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఇటీవలే రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఏ మాత్రం దాచకుండా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా. అందుకు అనుగుణంగానే ఆమె నిశ్చితార్ధం కూడా ఇటీవలే జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటే ఆమెను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ విషయాన్ని తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఇలాంటి బెదిరింపులను ఖండించకుండా పవన్ కళ్యాణ్ రేణూ దేశాయ్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇది. ‘మిస్ రేణూగారు.. కొత్త జీవితంలోని అడుగుపెడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. మరి పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ తో అయినా ఆయన అభిమానులను రేణూ దేశాయ్ ను బెదిరించటం ఆపేస్తారో లేదో వేచిచూడాల్సిందే.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT