Telugu Gateway
Telangana

తెలంగాణ ‘పంచాయతీ ఎన్నికలకు బ్రేక్’

తెలంగాణ ‘పంచాయతీ ఎన్నికలకు బ్రేక్’
X

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే ఛాన్స్ కన్పించటం లేదు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఎన్నికలకు రెడీ అంటూ పలుమార్లు ప్రకటన చేసినా..సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికలు మాకొద్దు అంటూ తేల్చిచెప్పారు. అయినా సరే..సీఎం రెడీ..ఎమ్మెల్యేలు నాట్ రెడీ అన్న చందంగా పరిస్థితి తయారు చేశారు. అంతే కాదు..బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో సర్కారే ఎన్నో పొరపాట్లు చేసింది. ఒక్కో సర్వేలో బీసీ జనాభా లెక్కలను ఒక్కో రకంగా చూపింది. ఇప్పుడు అదే ఎన్నికలకు బ్రేక్ లు వేసింది. అసలు బీసీల జనాభా పక్కాగా ఎంత మేరకు ఉందో తేలిన తర్వాతే ఎన్నికలు జరపాలని..అప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అందరూ ఊహిస్తున్నట్లే పంచాయతీ ఎన్నికలకు బ్రేకు పడింది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ లోనే లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం మెండుగా ఉండటంతో ఇక పంచాయతీల సంగతి ప్రస్తుతానికి మర్చిపోవచ్చు.

రాష్ట్రంలో బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో ఒక్కో రకంగా చూపుతోందని కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని పిటిషనర్‌ కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తెలంగాణలో బీసీ ఓటర్ల లెక్క తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించి.. నివేదికను తమకు సమర్పించాలని బీసీ కమిషన్‌ను ఆదేశించింది. అంతే కాదు..అప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేయవద్దని పేర్కొంది.

Next Story
Share it