Telugu Gateway
Offbeat

గోవా బీచ్ ల్లో ‘నో సెల్ఫీ’ జోన్లు

గోవా బీచ్ ల్లో ‘నో సెల్ఫీ’ జోన్లు
X

గోవా అంటే బీచ్ లు. బీచ్ లు అంటే గోవా. దేశంలో అత్యధిక బీచ్ లు ఉన్న ప్రాంతం ఇదే. అంతే కాదు..నిత్యం పర్యాటకులతో కళకళలాడుతాయి ఈ గోవా బీచ్ లు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో గోవాకు వస్తారు.ఈ మధ్య కాలంలో యువతకు ‘సెల్ఫీల’ పిచ్చి ముదిరింది. అది ఎంతగా అంటే..ప్రాణాల మీదకు వచ్చినా సరే..సెల్ఫీ దిగాల్సిందే అన్న చందంగా తయారైంది పరిస్థితి. మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కదా?. గోవాలోని కొన్ని బీచ్ లను ‘‘నో సెల్ఫీ’ జోన్లుగా ప్రకటించింది. ప్రమాదాల్లో పర్యాటకులు మృత్యువాత పడటమే దీనికి కారణం. గోవాలో ఎక్కువ పాపులర్ అయిన బీచ్ ల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడంతోపాటు..తగు చర్యలు కూడా తీసుకోనున్నారు.

గోవా బీచ్ ల్లో మొత్తం 24 ప్రాంతాలు సెల్ఫీలు దిగేందుకు ఏ మాత్రం అనువుగా లేని ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఎమర్జన్సీ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఉంచుతున్నారు.. ఒక్క జూన్ నెలలోనే ఇద్దరు పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ మరణించారు. దీంతో సర్కారు అప్రమత్తం అయి జాగ్రత్త చర్యలు చేప్టటింది. ఇప్పటికే సూర్యాస్తమయం తర్వాత పర్యాటకులు నీళ్లలో దిగకుండా కూడా కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశారు.

Next Story
Share it