Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా ‘జెర్సీ’

నాని కొత్త సినిమా ‘జెర్సీ’
X

టాలీవుడ్ లో గత కొంత కాలంగా హిట్లతో దూసుకెళుతున్న హీరో నాని. ఇప్పుడు నాగార్జునతో కలసి మల్టీస్టారర్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినిమా టైటిల్‌ లోగోతో పాటు కాన్సెప్ట్‌ పోస్టర్‌ ను కూడా రివీల్‌ చేశారు. జెర్సీ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టుగా సమాచారం. జెర్సీ మీద అర్జున్‌ 36 అని రాసిఉండటాన్ని బట్టి చూస్తే హీరో క్యారెక్టర్‌ పేరు అర్జున్‌ అని భావిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాని బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు.

Next Story
Share it