Telugu Gateway
Cinema

బిగ్ బాస్ 2లో నాని ఆకట్టుకోలేరా!

బిగ్ బాస్ 2లో నాని ఆకట్టుకోలేరా!
X

బిగ్ బాస్ 2 గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదస్పదం అవుతోంది. బిగ్ బాస్ 1ని జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించగా..ఇప్పుడు నాని వంతు వచ్చింది. చివరి రోజువరకూ పార్టిసిపెంట్స్ విషయంలో సస్పెన్స్ మెయింటెన్ చేశారు. ఈ జాబితా చూశాక సామాజిక మాధ్యమాల వేదికగా పెద్ద విమర్శలు విన్పిస్తున్నాయి. అందులో అంతా ఆంధ్రా ప్రాంతం వారే ఉన్నారని...ఫస్ట్ డే..ఫస్ట్ షో నాని పేలవంగా చేశారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక్క ప్రాంతాల గురించే కాదు..సామాజిక వర్గాల కూర్పుపైనా విమర్శలు వస్తున్నాయి. మరి నాని ఇవన్నీ తట్టుకుని షోను సక్సెస్ ఫుల్ గా ఎలా ముందుకు తీసుకెళతాడో వేచిచూడాల్సిందే.

ఫస్ట్ డే..ఫస్ట్ షోతోనే అంతా తేల్చేయలేం. అదే సమయంలో తీవ్ర స్థాయిలో వస్తున్న విమర్శలను కూడా విస్మరించటానికి వీల్లేదు. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం అయిన ఈ షో 106 రోజుల పాటు సాగనుంది. బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి ఛాన్స్ దక్కించుకున్న వారిలో గీతామాధురి, అమిత్ తివారి, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భానుశ్రీ, రోల్ దిదా, శ్యామల,, కిరిటీ, దీప్తి సునయన, కౌశల్, తేజస్వి, సామ్రాట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story
Share it