Telugu Gateway
Movie reviews

‘ఆఫీసర్’ మూవీ రివ్యూ

‘ఆఫీసర్’ మూవీ రివ్యూ
X

నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా వరకూ హిట్సే. అన్నింటి కంటే ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో 1989లో వచ్చిన ‘శివ’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమానే ఇద్దరి జీవితాలను మార్చేసిందనే చెప్పొచ్చు. తర్వాత వచ్చిన అంతం, గోవిందా..గోవిందా లు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ జట్టు కట్టారు ‘ఆఫీసర్’ సినిమా కోసం. ఈ సినిమా శుక్రవారం నాడే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ముంబయ్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారిగా పనిచేసిన కర్ణాటక కు చెందిన కె ఎం ప్రసన్న జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు వర్మ పలుమార్లు ప్రకటించారు. ముంబయ్ లో మాఫియా డాన్లు...కొంత మంది పోలీసు ఉన్నతాధికారులు కలసి ఎలా చేశారన్నదే ఈ సినిమా. ముంబయ్ పోలీసు శాఖతో పాటు ప్రజల్లో మంచి పేరు ఉన్న పన్సారీ మాఫియాతో కలసి దందాలు..మర్డర్లు చేస్తుంటాడు.

ఆయనపై కోర్టులో కేసు నమోదు కావటంతో ఈ విచారణ బాధ్యతను శివాజీ రామ్ (నాగార్జున)కు అప్పగిస్తారు. హైదరాబాద్ కు చెందిన ఐపీఎస్ అధికారిగా నటించిన నాగార్జున సిట్ ఆఫీసర్ గా ముంబయ్ చేరుకుని..తన టీమ్ తో విచారణ పూర్తి చేస్తారు. ఈ కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న వ్యక్తిని పన్సారీ హత్య చేయించటంతో కోర్టు ఆయనపై ఉన్న కేసును కొట్టేసి..తిరిగి పోలీసు శాఖలో నియామకానికి ఆదేశాలు జారీ చేస్తుంది. తిరిగి పోలీసు శాఖలో చేరిన పన్సారీ తానే స్వయంగా ఓ గ్యాంగ్ ను తయారు చేసి..హత్యలు చేయించుతుంటాడు. అందులో పారిశ్రామికవేత్తలతోపాటు సినీ నిర్మాతలు వంటి కీలక వ్యక్తులు ఉంటారు. ఈ కేసు విచారణ బాధ్యతను ప్రభుత్వం పన్సారీకి అప్పగిస్తుంది. పన్సారీ తన టీమ్ లో కావాలనే నాగార్జున తోపాటు ఆయన పాత టీమ్ ను కూడా వేసుకుని అంతం చేయాలని చూస్తాడు.

నాగార్జునే కొత్తగా వచ్చిన మాఫియా గ్యాంగ్ ను నడుపుతున్నారని..ఓ దశలో అరెస్టు చేయటానికి కూడా ప్లాన్ చేశారు. అయినా నాగార్జున తప్పించుకుని వెళ్లి...తన ప్రాణాలు కాపాడటంతోపాటు..పన్సారీ దందాకు ముగింపు పలుకుతాడు. పోలీసు అధికారిగా నాగార్జున తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఫుల్ ఎనర్జిటిక్ గా కన్పించారు. మాఫియాతో కలసి పనిచేసే పోలీసు అధికారిగా పన్సారీదే ఈ సినిమాలో కీలక పాత్ర అని చెప్పొచ్చు. సినిమా అంతా అతడి చుట్టూనే తిరుగుతుంది. సినిమా మొత్తంలో ఒక్కటంటే ఒకే పాట ఉంది. మైరా సరేన్ పోలీసు అధికారిగానే సినిమాలో కాసేపు సందడి చేస్తారు. రెగ్యులర్ సినీ ప్రేక్షకులకు సంబంధించిన కామెడీ, పాటలు కన్పించవు. అయితే యాక్షన్ సన్నివేశాలు కోరుకునే ప్రేక్షకుల మాత్రం ఓకే. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్లు తప్ప..సినిమా చాలా వరకూ కూల్ గానే సాగిపోతుంది. నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాలతో దీన్ని పోల్చలేకపోయినా..వీరిద్దరి కాంబినేషన్ మరోసారి కలిసొచ్చిందని చెప్పొచ్చు.

రేటింగ్2.5/5

Next Story
Share it