Telugu Gateway
Movie reviews

‘నా నువ్వే’ మూవీ రివ్యూ

‘నా నువ్వే’ మూవీ రివ్యూ
X

నందమూరి కళ్యాణ్ రామ్. ఇప్పటివరకూ తన కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా కొట్టలేదు. కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన సినిమాలు అన్నీ యావరేజ్ రేంజ్ లో నడిచినవే. తాజా సినిమా ఎమ్మెల్యేది కూడా అదే వరస. ఈ నందమూరి హీరో మిల్కీబ్యూటీ తమన్నాతో కలసి ‘నా నువ్వే’ అంటూ ముందుకొచ్చారు. ఈ సినిమా కథ అంతా ‘డెస్టినీ’ చుట్టూనే తిరుగుతోంది. రేడియో జాకీగా పనిచేసే మీరా (తమన్నా) డెస్టినీని గట్టిగా నమ్ముతుంది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో విమానాశ్రయానికి వెళ్లి మరీ ప్రయాణాలను వివిధ కారణాలతో రద్దు చేసుకుంటూ ఏ మాత్రం డెస్టినీ నమ్మని వ్యక్తిగా వరుణ్ (కళ్యాణ్ రామ్) ఉంటారు. వీరిద్దరి జర్నీలో జరిగే సంఘటనలే సినిమా అంతా. ఓ పూలు అమ్మే వ్యక్తి డెస్టినీ గురించి చెబుతూ నేను అమ్మే పూలలో కొన్ని దేవుడి దగ్గరకు వెళతాయి. మరికొన్ని సమాధుల దగ్గరకు వెళతాయి. డెస్టినీ అంటే అదే. ఎవరు ఎక్కడకు చేరాలో అక్కడకు చేరతారనే సందేశం ఇస్తారు. మరో సందర్భంలో వెన్నెల కిషోర్ ‘గ్యారంటీ వస్తువులకు ఉంటుంది. నమ్మకానికి కాదు’’ అని చెబుతారు.

ఇలా సినిమా మధ్యలో అప్పుడప్పుడు పేలిన డైలాగ్ లు తప్ప..సినిమా అంతా ఏ మాత్రం జోష్ లేకుండా..నిస్సారంగా...భారంగా ముందుకు కదులుతుంది. డెస్టినీ నమ్మే మీరా..ఏ మాత్రం దీన్ని నమ్మని వరుణ్ క్లైమాక్స్ లో కలుసుకోవటంతో కథ ముగిసిపోతుంది. విడిపోయిన వీరిద్దరు కలుసుకోవటం కోసం ఓ ఎఫ్ ఎం ఛానల్ రైల్వే స్టేషన్ లో మారథాన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందులో హీరో..హోరోయిన్లవి నటనకు ఏ మాత్రం స్కోప్ లేని పాత్రలు . హీరోయిన్ తమన్నా మాత్రం అందాలు ఆరబోసింది. సినిమాలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళీ పాత్రలే అప్పుడప్పుడు నవ్విస్తాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నా...సినిమా కథలో దమ్ములేకపోవటంతో ప్రేక్షకులు భారంగా కాలం వెళ్లదీయాల్సి వస్తుంది. ఓవరాల్ గా చూస్తే ‘నా నువ్వే’ మా కొద్దు అనటమే బెటర్.

రేటింగ్. 1.5/5

Next Story
Share it