Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుకు మరో షాక్

తెలంగాణ సర్కారుకు మరో షాక్
X

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు వ్యవహారం సర్కారును వీడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తుంటే..సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కోర్టు తీర్పు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను వచ్చే నెల (జూలై) 13కు వాయిదా పడింది. తమను ఎమ్మెల్యేలుగా పరిగణించాలన్న తీర్పును అమలు చేయక పోవడాన్ని సవాల్‌ చేస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్ లు పిటీషన్ దాఖలుచేశారు.

దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు తాజాగా అసెంబ్లీ కార్యదర్శికి, న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కోర్టుకు ఏమి సమాధానం ఇస్తారు..ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది అన్న అంశం ఆసక్తికరంగా మారనుంది. ఈ పరిణామాలు అధికార టీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం చేస్తాయనే ప్రచారం గత కొంత కాలంగా పార్టీ నేతల్లో ఉంది. కోర్టులో కేసు విచారణకు వచ్చేలోగానే సభ్యత్వాల పునరుద్ధరణ జరుగుతుందా? లేక పాత స్టాండ్ కే కట్టుబడి ఉంటారా? అన్నది వేచిచూడాల్సిందే.

.

Next Story
Share it