Telugu Gateway
Telangana

వంద సీట్లు వచ్చే కెసీఆర్ కు పక్క పార్టీ నేతలెందుకో?

వంద సీట్లు వచ్చే కెసీఆర్ కు పక్క పార్టీ నేతలెందుకో?
X

తెలంగాణ ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అదినేత కెసీఆర్ మాట్లాడితే వంద సీట్లకు తక్కువ కాకుండా మాట్లాడతారు. నాలుగేళ్ల పాలన తర్వాత కూడా ఇంకా ‘పక్క పార్టీ’ నేతలపై ఆధారపడటం అంటే..ఇంకా పార్టీ బలహీనంగానే ఉందని అంగీకరిస్తున్నట్లేనా?. ఒకప్పుడు దానం నాగేందర్ పై సాక్ష్యాత్తూ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు నీకంత సీన్ ఉందా?.నువ్వు పార్టీలోకి వస్తే కెసీఆర్ స్వాగతం పలకాలా? అంటూ ప్రశ్నలు గుప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు.. మరి సీఎఎం కెసీఆర్ ఇప్పుడు ఎందుకు దానం నాగేందర్ కు స్వాగతం పలికినట్లో. హైదరాబాద్ లో ఇఫ్పటికే కీలక నేతలు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ కూడా చేరటంతో నగరంలో అంతర్గత పోరు పెరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత భారీగా ఉందని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ తోపాటు మరి కొంత మంది నేతలను కూడా పార్టీలో చేర్చుకుని ‘కాంగ్రెస్ పార్టీ’ పని అయిపోయిందనే సంకేతాలు పంపటం ద్వారా బయటపడాలని చూస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు లాభం చేకూర్చి పెడుతుందో కొద్ది కాలం పోతే కానీ తెలియదు. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉద్యమకారుల కంటే ఉద్యమంతో ఏ మాత్రం సంబంధం లేని వారు..లేదంటే ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారే కీలక పాత్రల్లో ఉన్న విషయంపై పార్టీలోనే విస్తృత చర్చ సాగుతోంది. ఇఫ్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో ‘సీట్ల కేటాయింపు’తో పెరిగే అసంతృప్తులను ఎలా సర్దుబాటు చేస్తారన్నది చూడాల్సిందే. అయితే ప్రస్తుతం హుషారుగా పార్టీలో చేరికలు అయితే ఉంటాయి కానీ...సీట్ల కేటాయింపు తర్వాత అసలు రంగు వెలుగులోకి వస్తుందని టీఆర్ఎస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. చేసిన పనులు.తమ పథకాలే గెలిపిస్తాయి అని చెబుతున్న కెసీఆర్...మరి ఇతర పార్టీల నేతలపై ఎందుకు ఆధారపడుతున్నట్లో?.

Next Story
Share it