Telugu Gateway
Politics

కొలువుదీరిన కర్ణాటక కొత్త మంత్రివర్గం

కొలువుదీరిన కర్ణాటక కొత్త మంత్రివర్గం
X

కర్ణాటకలో పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడింది. పలు ట్విస్ట్ లు..టెన్షన్ల అనంతరం మంత్రివర్గ బెర్త్ ల కేటాయింపుపై కాంగ్రెస్, జెడీఎస్ లు ఓ అంగీకారానికి వచ్చాయి. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది. మిత్రపక్షం కాంగ్రెస్‌కు 14 మంత్రి పదవులు, జేడీఎస్‌కు 7 మంత్రి పదవులు దక్కాయి. అలాగే బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్‌ మహేష్‌ను, కేజీపే పార్టీ అభ్యర్థిని కూడా కేబినెట్‌లోకి తీసుకున్నారు. బీఎస్పీ కూడా కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక కాంగ్రెస్‌ అగ్రనాయకులు, జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చర్చించి ఆయన ఆమోదంతో మంత్రి పదవులు ఖరారు చేశారు. రాహుల్‌ ఆమోదం పొందిన జాబితా అందిన తర్వాతనే సీఎం కుమారస్వామి మంత్రివర్గ ఏర్పాటుకు పూనుకున్నట్టు సమాచారం. రానున్న 2019 పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌ గాంధీ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇచ్చినట్టు సమాచారం. తర్వాతి కాలంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా కీలక మంత్రి పదవులను రెండు పార్టీలు సమానంగా పంచుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story
Share it