Telugu Gateway
Top Stories

బ్యాంకులకు చిక్కకుండా తిరుగుతున్న నగదు

బ్యాంకులకు చిక్కకుండా తిరుగుతున్న నగదు
X

ప్రధాని మోడీ ప్లాన్ రివర్స్ అయింది. నోట్ల రద్దుతో ఎకానమీ అంతా ‘డిజిటల్’ వైపు మారుతుందని భావిస్తే ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. నోట్ల రద్దుకు ముందు కంటే తర్వాత భారీ ఎత్తున నగదు మార్కెట్లో చెలామణిలో ఉంది. అందులో మరో విచిత్రం ఏమిటంటే బ్యాంకులకు వెళ్ళకుండా అది బయట బయటే తిరుగుతోంది. ఒక్క నోట్ల రద్దు నిర్ణయం ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పోయేలా చేసిందని చెప్పొచ్చు. దీనికితోడు బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకున్న కుంభకోణాలు..ప్రభుత్వ నిర్ణయాలు వెరసి బ్యాంకులు అంటే భయపడాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. ఈ తరుణంలో ఆర్ బిఐ విడుదల చేసిన గణాంకాలు అందరిని నివ్వెరపర్చేలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రజల వద్ద గతంలో ఎన్నడూలేని రీతిలో గరిష్ట మొత్తంలో నగదు చెలామణిలో ఉందని ఆర్ బి ఐ వెల్లడించింది. 2016 డిసెంబర్‌ 9 నాటికి ప్రజల వద్ద ఉన్న నోట్ల విలువ 7.8 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది మే 25 నాటికి 18.5 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు జనం దగ్గర ఉన్నా యని ఆర్‌బీఐ ప్రకటించింది. నోట్లరద్దు అనంతర రోజులతో పోలిస్తే ప్రస్తుతం రెండింతలకు పైగా నగదు చలామణిలో ఉంది. 2017 జనవరి 6 నాటికి రూ. 8.9 లక్షల కోట్లు చలామణిలో ఉండగా, 2018 జూలై 1 నాటికి అది రూ. 19.3 లక్షల కోట్లకు చేరుకుంది. కొందరు వ్యక్తులు వివిధ కారణాలతో భారీ స్థాయిలో డబ్బును బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుని, చలామణిలోకి తేకుండా దాచిపెట్టడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it