Telugu Gateway
Cinema

సన్నీలియోన్ కు ఊహించని మద్దతు

సన్నీలియోన్ కు ఊహించని మద్దతు
X

నర్గీస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్ ఎలాగో..సన్నీ లియోన్ కూడా అంతే. ఆమెను విడిగా చూడాల్సిన అవసరం కూడా లేదు. నటిగా సన్నీలియోన్ తన సత్తా ఏంటో చాటింది. ఇప్పటికీ ఇంకా ఆమెను పోర్న్ స్టార్ గా చూస్తే ఈ దేశాన్ని ఎవరూ బాగుచేయలేరు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?. గుజరాత్ లో ప్రధాని మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు వ్యతిరేకంగా గళం ఎత్తిన పటీదార్ ఉద్యమ నేత హర్ధిక్ పటేల్. మధ్యప్రదేశ్‌లోని ఓటర్లను చైతన్య పరచడానికి హర్ధిక్‌ జూలైలో యాత్ర ప్లాన్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సన్నీ లియోన్‌ గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఆమెకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. గతంలో కూడా హర్ధిక్‌ సన్నీకి మద్దతుగా మాట్లాడారు. బీజేపీ అధికారం కోసం వెంపర్లాడుతోందని హార్థిక్‌ విమర్శించారు. ఒకవేళ 2019లో మోదీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో మళ్లీ ఎన్నికలు జరగవేమోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో జగిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు.

Next Story
Share it