‘విజయ్ దేవరకొండ’ అదరగొట్టాడు

ఒక్క ఫోటో. అంచనాలు అమాంతం పెంచేశాయి. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ రేంజ్ కు వెళ్లిపోయిన విజయ్ దేవరకొండ ఈ సినిమా లుక్ తోనూ కేక పుట్టిస్తున్నాడు. ముఖ్యంగా యూత్ ను ఈ ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాదు...ఫోటో కింద పెట్టిన డైలాగులు అదరగొడుతున్నాయి. ‘నా కాళ్లు తిమ్మిరెక్కినా.. నడుము నొప్పి లేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్..’ అంటూ కింద కామెంట్ పెట్టాడు.
శనివారం నాడు విడుదలైన గీత గోవిందం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ గోడకు కాళ్లు పెట్టుకుని కూర్చుంటే, కాళ్ల పై రష్మిక కూర్చొని నవ్వుతూ ఉంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో గీత పాత్రలో ఛలో ఫేం రష్మిక మందన నటిస్తున్న విషయం తెలిసిందే. గోవిందం పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. సోలో ఫేం పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.