Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘ఆటగాళ్లు’ ట్రైలర్ విడుదల

0

ఆటగాళ్లు వచ్చేస్తున్నారు. అందులో భాగంగా ముందు ట్రైలర్ విడుదల అయింది. ఇందులో నారా రోహిత్, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా.    ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరపుకుంటున్నది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  ఈ సినిమాలో నారా రోహిత్ సినీ దర్శకుడిగా కనిపిస్తుండగా జగపతి బాబు లాయర్‌ పాత్రలో నటించారు. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ తన భార్యను చంపిన కేసులో ముద్దాయిగా , జగపతి బాబు, రోహిత్‌కు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా కనిపిస్తున్నారు.

- Advertisement -

రోహిత్‌ను దోషిగా ప్రూవ్‌ చేసేందుకు జగ్గుబాయ్‌ ఎత్తులు, కేసు నుంచి బయటపడేందుకు రోహిత్ ప్రయత్నాల నేపథ్యం సినిమా తెరకెక్కించారు. ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ  చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ కింద  వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము తదితరులు తెరకెక్కించారు.

Leave A Reply

Your email address will not be published.