‘ఆటగాళ్ళు’ టీజర్ విడుదల
‘ఆట’ త్వరలోనే మొదలుకాబోతోంది. ఇందులో ఆటగాళ్ళు నారా రోహిత్, జగపతిబాబు. టాలీవుడ్ లో వీద్దరిదీ విభిన్నశైలి. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను శనివారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే చిత్ర యూనిట్ ప్రచార హోరు పెంచే పనిలో పడింది. పరుచూరి మురళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల పని వేగంగా జరుగుతోంది. టీజర్‌లోనే సినిమా కథేంటో రివీల్ చేసేశారు చిత్రయూనిట్. తన భార్యను చంపిన కేసులో రోహిత్ అరెస్ట్ కాగా రోహిత్‌కు వ్యతిరేకంగా వాధించే లాయర్ పాత్రగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జగపతిబాబు కనిపించారు.
ఆట నువ్వు మొదలుపెట్టావు..నేను క్లోజ్ చేస్తా అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా జూలై మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాసిరెడ్డి రవీంద్రనాధ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్ తదితరులు ఈ చిత్ర నిర్మాతలుగా ఉన్నారు.
https://www.youtube.com/watch?v=xNULJ85ai4w