Telugu Gateway
Cinema

‘ఆటగాళ్ళు’ విడుదలకు రెడీ

‘ఆటగాళ్ళు’ విడుదలకు  రెడీ
X

నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆటగాళ్ళు’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేయనుంది. అదే సమయంలో సినిమాను జూలై5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పరుచూరి మురళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా...వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము తదితరులు నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ కు జోడీగా బెంగాలీ మోడల్ దర్శన బానిక్ నటించారు. సినిమా విడుదల ముహుర్తం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది.

Next Story
Share it