Telugu Gateway
Andhra Pradesh

బిజెపిని దెబ్బకొట్టామంటున్న టీడీపీ

బిజెపిని దెబ్బకొట్టామంటున్న టీడీపీ
X

కర్ణాటక ఎన్నికల వ్యవహారంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కర్ణాటకలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలను తిరస్కరించారని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. అంతే కాదు..తమ దక్షిణాది యాత్ర ప్రారంభం అయిందని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం తాము కర్ణాటకలో బిజెపిని దెబ్బకొట్టామని చెబుతోంది. ఈ మేరకు వాట్సప్, సోషల్ మీడియాల్లో విరివిగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవ లెక్కలు ఇవిగో...ప్రత్యేక హోదా విషయంలో..విభజన హామీలను అమలు చేయటంలో విఫలమైన బిజెపిపై తెలుగు ప్రజలు తమ కసి తీర్చుకున్నారని టీడీపీ వాదిస్తోంది. కర్ణాటకలో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించినా..టీడీపీ మాత్రం పక్క రాష్ట్రంలో తెలుగు ప్రజలను ఇరకాటంలోకి నెట్టే పని మాత్రం కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ లెక్కలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ కర్ణాటక లో 21 సీట్లు కాంగ్రెస్ కు వస్తే . బీజేపీకి 15 సీట్లు వచ్చాయని తెలిపారు. అదే బెంగళూరు సిటీ లో 15 సీట్లు కాంగ్రెస్ గెలిస్తే, బీజేపీ 11 సీట్లు గెలుచుకున్నట్లు టీడీపీ మెసేజ్ సర్కులేట్ చేస్తోంది. అదే సమయంలో బళ్లారిలో కాంగ్రెస్ ఆరు, బిజెపి మూడు సీట్లు మాత్రమే దక్కించుకోగలిగిందని పేర్కొన్నారు.

నమ్మక ద్రోహం చేస్తే త్వరగా శిక్షకు పాత్రులవుతారని కర్ణాటకలో అధికారానికి బీజేపీని దూరం పెట్టిన తెలుగు ఓటర్లు అంటూ టీడీపీ భారీ ఎత్తున సోషల్ మీడియాలోప్రచారం చేస్తోంది. అంతే కాదు..అధికారికంగా కూడా ఈవిషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో బలమైన తెలుగుదేశం పార్టీ, సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బీజేపీ పప్పులుడకవ్ అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it