పవన్ కళ్యాణ్ అభిమానులు అంతేనా?
ఇవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా వ్యాఖ్యలు. ఆయన మళ్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేశారు. దీనికి కారణం ఆయన తాజా సినిమా ఆఫీసర్ టీజర్ కు 11 వేల డిస్ లైక్స్ రావటమే. నాగార్జున హీరోగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల మంది ఉన్నారు..అందులో మీ ఫ్యాన్స్ 11 వేల మందేనా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని జనసేన చాలా సీరియస్ గా తీసుకోవాలని..లేదంటే ప్రజారాజ్యం కంటే దారుణమైన ఫలితాన్ని చూడాల్సి ఉంటుందని ట్విట్టర్ వేదిక గా వ్యాఖ్యానించారు. ఆఫీసర్ టీజర్ కు ఇంకా ఇంకా డిస్‌లైక్స్ కొట్టి పవన్ ఫ్యాన్స్ తమ సత్తా చూపించాలని, ఓ అభిమానిగా.. నాగార్జున, ఆఫీసర్ల తరఫున ఈ మేరకు పవన్ ఫ్యాన్స్ కు, జనసేనకు వార్నింగ్ ఇస్తున్నట్లు వర్మ పేర్కొన్నారు. నాగార్జున-వర్మ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఆఫీసర్’ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.