బ్యాంకాక్ లో రామ్ చరణ్..కైరా సందడి
ఒక్క సినిమాతోనే కైరా అద్వానీ టాలీవుడ్ లో మంచి ముద్ర వేసింది. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించిన ఈ భామ ఇప్పుడు రామ్ చరణ్ తో జోడీ కట్టనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాత కూడా డీవీవీ దానయ్యే. దానయ్య ఇప్పటికే తన బ్యానర్ లో మరోసారి కైరాకు ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో రామ్ చరణ్ తో జోడీ కట్టనుంది ఈ బాలీవుడ్ భామ. ఇప్పటికే ఈ కొత్త సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రారంభం అయింది కూడా.
అంతే కాదు..మరో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఈ నెల 12న నుంచి బ్యాంకాక్ వెళుతోంది. మాస్ హీరో రామ్ చరణ్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ కావటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ను కొత్త కోణంలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.