Telugu Gateway
Andhra Pradesh

ముందు కౌగిలింతలు..వెనక నుంచి కత్తిపొట్లు

ముందు కౌగిలింతలు..వెనక నుంచి కత్తిపొట్లు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జనసేన అధినేతప పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి కౌగిలించుకుని..వెనక నుంచి బాకులతో పొడవటం మీకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. కిడ్నీబాధితుల్లోనూ కొంత మందికే పెన్షన్లు ఇస్తున్నారు. అందరికీ ఇవ్వాలి. కాదంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్ని బాధితులను ఆదుకోవాలంటూ ఒక్క రోజు దీక్ష ముగిసిన తర్వాత ప్రసంగించిన పవన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. తన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని..సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఇది సాగుతుందని తెలిపారు. ఇలాంటి సమస్యలు ఉంటాయనే తెలిసే బరిలోకి దిగామని..వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతామన్నారు.

పుష్కరాలకు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు కానీ..ఉద్ధానం కిడ్నీ బాధితులకు సాయం అందించేందుకు నిధులు ఉండవా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఇళ్లు ఉందని మీరు అయితే స్టార్ హోటల్ లో ఉంటారు కానీ సామాన్య ప్రజల ఆరోగ్యం బాగు చేయటానికి నిధులుండవా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీకాకుళం జిల్లా వెనకబాటుతనం చూసి అయినా ప్రధాని మోడీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. లేదంటే యువత పోరాటబాట పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగా ఏపీకి అన్యాయం చేయవద్దన్నారు.పవన్ కళ్యాణ్ నిరహారదీక్షకు సీపీఎం, సీపీఐ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

Next Story
Share it