Telugu Gateway
Movie reviews

‘నేలటిక్కెటు’ మూవీ రివ్యూ

‘నేలటిక్కెటు’ మూవీ రివ్యూ
X

రవితేజ సినిమాలు అంటే చాలా వరకూ జోష్..హుషారు సహజం. ఎందుకంటే మాస్ మహారాజాగా పేరున్న ఈ హీరోలో ఎనర్జీ లెవల్ అలా ఉంటుంది మరి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ హీరో ‘రాజా ది గ్రేట్’ సినిమాతో అదరగొట్టాడు. తర్వాత వచ్చిన ‘టచ్ చేసి చూడు’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోయింది. ఇప్పుడు ‘నేలటిక్కెటు’ వంతు వచ్చింది. రవితేజ సినిమా కదా...ఎంతో కొంత సరదాగా ఎంజాయ్ చేయోచ్చు అని సినిమాకు వెళితే పరార్ కావాల్సిందే. బహుశా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమా మధ్యలో నుంచి వెళ్లిపోయింది ఈ నేలటిక్కెటులోనే అని చెప్పొచ్చు. అసలు కథ విషయంలో కానీ..పాటలు..క్లైమాక్స్, కామెడీ ఏ ఒక్కటీ కూడా బాగుంది అని చెప్పే పరిస్థితి లేదు ఈ సినిమా విషయంలో. ఫస్టాఫ్ ఒకింత సో సో గా నడిపించిన దర్శకుడు కళ్యాణకృష్ణ సెకండాఫ్ లో మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడు.

కురసాల కళ్యాణకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల్లో ఇది ఆయన కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగలటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించిన హీరోయిన్ మాళవిక ఓకే అన్పించుకుంది. మాళవిక యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకుంది కానీ...పాటల్లో మాత్రం ఒకింత భిన్నంగా కన్పించింది. రవితేజ ఎనర్జీ లెవల్స్ ఎక్కడా తగ్గకపోయినా కథలో ఏ మాత్రం దమ్ములేకపోవటంతో ప్రేక్షకులు ఏ దశలోనూ సినిమాలో లీనం కాలేకపోయారని చెప్పొచ్చు. హోం మంత్రి పాత్రలో నటించిన జగపతిబాబుదీ అదే పరిస్థితి. రొటీన్ పాత్రతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నేలటిక్కెటు సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్షే.

రేటింగ్. 1.75/5

Next Story
Share it