Telugu Gateway
Cinema

‘నా నువ్వే’ ట్రైలర్ వచ్చేసింది

‘నా నువ్వే’ ట్రైలర్ వచ్చేసింది
X

ఎమ్మెల్యే సినిమాతో అలా హడావుడి చేశాడో లేదో...నందమూరి కళ్యాణ్ రామ్ అప్పుడే ‘నా నువ్వే’ పేరుతో సందడి చేయటానికి రెడీ అయిపోతున్నాడు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల జోరు కూడా పెంచేసింది. అందులో భాగంగానే బుధవారం ఈ సినిమాకు సంబంధించిన ‘ట్రైలర్ ’ విడుదల చేశారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. జయేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ట్రైలర్ లో కళ్యాణ్ రామ్, తమన్నాల సందడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మధ్యలో వెన్నెల కిషోర్ చెప్పే ‘ఇదేం ట్విస్ట్ బావా..జ్యోతిష్యానికే జ్వరం వచ్చేలా ఉంది’ అనే డైలాగ్ అదిరిపోయేలా ఉంది. మే నెలాఖరులో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. కళ్యాణ్ రామ్ ఓ వైపు నిర్మాతగా సినిమాలు తీస్తూనే..మరో వైపు హీరోగా సందడి చేస్తున్నారు.

.

https://www.youtube.com/watch?v=JK7bH_WwO0M

Next Story
Share it