Telugu Gateway
Cinema

విజయ్ మాల్యా బయోపిక్

విజయ్ మాల్యా బయోపిక్
X

అవును. మీరు వింటున్నది నిజమే. ఒకప్పుడు దేశ పారిశ్రామిక రంగంలో కీలక వ్యక్తిగా..కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేతగా ఉన్న విజయ్ మాల్యా ఇప్పుడు దేశం వదిలి పారిపోయారు. పారిపోవటమే కాదు...దేశంలోని బ్యాంకులకు 9000 కోట్లు ఎగ్గొట్టి మరీ వెళ్ళారు. విజయ్ మాల్యా మాత్రం దేశంలో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపారు. అంతే కాదు..ఇప్పుడు లండన్ లోనూ అదే పరిస్థితి. కానీ దేశీయ బ్యాంకులు మాత్రం మాల్యా మూలంగా కష్టాల్లో పడ్డాయి. అంతిమంగా ఈ భారం ప్రజలపైనే పడటం ఖాయం.

ఇలాంటి వివాదస్పద పారిశ్రామికవేత్త జీవిత చరిత్రను సెన్సార్ బోర్డు మాజీ చీఫ్ పహ్లజ్ నిహ్లానీ తెరకెక్కిస్తున్నరు ఈ సినిమా. మాల్యాగా ఈ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో గోవిందా నటిస్తున్నారు. బ్కాంక్ కుంభకోణం సన్నివేశాలను కూడా ఈ సినిమాలో ఫన్నీగా చూపిస్తున్నారట. కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై ఓ పాటను కూడా చిత్రీకరించారు. మాల్యా లుక్ లో ఉన్న గోవిందా ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Next Story
Share it