Telugu Gateway
Offbeat

ఫేస్ బుక్ ‘డేటింగ్ ఫీచర్’

ఫేస్ బుక్ ‘డేటింగ్ ఫీచర్’
X

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరో సంచలనానికి కేంద్రంగా మారింది. త్వరలోనే ఫేస్ బుక్ లో ‘డేటింగ్ ఫీచర్’ తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు టెక్నాలజీ సంస్థలు డేటింగ్ యాప్స్ ను అందుబాటులోకి తీసుకురాగా..ఫేస్ బుక్ ఉచితంగా తాము ఈ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఇది పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉందని టెక్నాలజీ పండితులు అంచనా వేస్తున్నారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మంగళవారం నాడే ఈ కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా డేటా చౌర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్ బుక్ తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు జూమ్ అన్నాయి. ప్రత్యర్ధులు షేర్లు అలాగే నష్టపోయాయి.

డేటింగ్ ఫీచర్ ఎన్నో సురక్షితమైన అంశాలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డేటింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఫేస్ బుక్ ప్రపంచంలో అతిపెద్ద సోషల్‌ నెట్‌వర్క్‌ కావటంతో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతోంది. ‘ఫేస్‌బుక్‌పై 200 మిలియన్లకు పైగా యూజర్లు ఒంటరివారే. దీంతో ఇక్కడే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించాం’ అని జుకర్ బర్గ్ తెలిపారు. ప్రస్తుతం తమ ఫేస్ బుక్ ఖాతాలో ఉన్న ఫ్రెండ్స్ కు తెలియకుండానే ఈ డేటింగ్ ఫీచర్ లో వివరాలు నమోదు చేసుకోవచ్చని సమాచారం. డేటింగ్ ఫీచర్ తోపాటు పలు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్ బుక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Next Story
Share it