Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

బిజెపి కొనుగోళ్లు..చంద్రబాబు కొనుగోళ్ళ మధ్య తేడా అదే!

0

ఒక పార్టీపై గెలిచిన ఎమ్మెల్యేలను మరో పార్టీ కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే అది ఎవరు చేసినా తప్పే. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారు ఎవరైనా ఇదే మాట చెబుతారు. అయితే రాజకీయ కొనుగోళ్ళకు కూడా చాలా తేడాలు ఉంటాయి?. అవసరం కోసం కొనుగోళ్లు?. ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బతీసేందుకు చేసే కొనుగోళ్లు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ఎమ్మెల్యేల  కొనుగోళ్లు స్వాతంత్ర పోరాటం కోసం చేసినవా?  అవి తప్పు కానప్పుడు బిజెపి చేసిన కొనుగోలు ప్రయత్నాలు తప్పు ఎలా అవుతాయి?. ముఖ్యంగా ఇప్పుడు బట్టలు చించుకుంటున్న తెలుగుదేశం నేతలకు. కర్ణాటకలో నిజంగా బిజెపి కొనుగోళ్లు ఫలించి ఉంటే వాళ్లకు అధికారం దక్కి ఉండేది?. అధికారం చేజిక్కుంచుకోవటం కోసం ఇలాంటి ప్రయత్నాలు అన్ని పార్టీలు గతంలో  చేసినవే?. ఇది తప్పు కదా? అని అనొచ్చు. కాదని ఎవరు మాత్రం చెప్పగలరు?. అయితే ఏపీలో పూర్తి మెజారిటీ ఉండి..అవసరం లేకపోయినా చంద్రబాబు చేసిన కొనుగోళ్ళ సంగతి ఏంటి?. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 20 మందికిపైగా ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎందుకు కొనుగోలు చేసినట్లు?. అంటే కేవలం తన రాజకీయ ‘అవసరం’ కోసమే అని చెప్పొచ్చు.

- Advertisement -

అంతే కాదు..సొంత పార్టీ నేతలను వెన్నుపోటు పొడిచి ‘ఫిరాయింపు’ నేతలకు ఏకంగా నలుగురికి మంత్రి పదవులు ఇఛ్చిన ఘనచరిత్ర చంద్రబాబు సొంతం. కర్ణాటకలో బిజెపి తీరును ఇఫ్పుడు తీవ్రంగా తప్పుపడుతున్న చంద్రబాబు…ఇదే బిజెపి గోవాలో, మేఘాలయలో ఒక్కో విధానం అనుసరించిందని తాజాగా  ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. కానీ అప్పుడు మాత్రం ‘మౌనపాత్ర’ పోషించి…అంతా అయిపోయాక ఇప్పడు ‘కేకలు’ వేస్తున్నారు. ఏ విషయంలో అయినా..తన వైపు  ఎన్ని తప్పులు ఉన్నా..అన్నీ మర్చిపోయి పక్కవాళ్ల మీద ఎంతో ‘కాన్ఫిడెంట్’గా విమర్శలు చేయగల నేతల్లో బహుశా చంద్రబాబు ముందు వరసలో ఉంటారేమో.

 

Leave A Reply

Your email address will not be published.