చంద్రబాబు వెదర్ రిపోర్ట్..అధికారుల షాక్
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాతావరణ వివరాలు చెప్పటం ఏంటి అని అవాక్కు అవుతున్నారా. మీరు ఒక్కరే కాదు సుమా. అధికారులు కూడా ప్రస్తుతం షాక్ లోనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు మాటలు అలా ఉన్నాయి మరి. అవేంటో మీరూ చూడండి ఓ సారి. వేసవిలో వడగాల్పులు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పది డిగ్రీలు తగ్గేలా చూడాలి. పచ్చదనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల వస్తుంది . ఇవీ ముఖ్యమంత్రి మాటలు. ఇవి ఎవరో గిట్టనివారు చెప్పినవి కావు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాయం విడుదల చేసిన ప్రకటనలోని అంశాలే. పచ్చదనం ఓకే...తుంపర సేద్యంతో చంద్రబాబు ఎలా ఉష్ణోగ్రతలు తగ్గిస్తారా అని అధికారులు అవాక్కు అవుతున్నారు. గత కొన్నేళ్లుగా అదే మాట చెబుతున్నారు కానీ..ఈ దిశగా అడుగులు మాత్రం ఆశించిన స్థాయిలో పడుతున్న దాఖలాలు ఎక్కడా లేవు.