Telugu Gateway
Politics

‘అమిత్ షా ‘భరత్ అనే నేను’ సినిమా చూశారా!

‘అమిత్ షా ‘భరత్ అనే నేను’ సినిమా చూశారా!
X

తెలుగు సినిమా ‘అమిత్ షా’ ఎందుకు చూస్తాడు అంటారా?. ఎందుకంటే ఆయన ఢిల్లీలో తాజాగా చేసిన వ్యాఖ్యలు అచ్చం భరత్ అనే నేను సినిమాల్లో ఉన్నవే చెప్పారు మరి. అదేంటి అంటారా?. కాంగ్రెస్, జెడీఎస్ లు తమ ఎమ్మెల్యేలను స్వేచ్చగా వదిలి ఉంటే..వారు తమ తమ నియోజకవర్గాలకు వెళితే ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజలే ఖచ్చితంగా బిజెపికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసేవారట. ఈ విషయాన్ని బిజెపి జాతీయ అధ్యక్షడు అమిత్ షానే స్వయంగా ఢిల్లీలో చెప్పారు. అలా తాము అధికారంలోకి వస్తామనే ధీమాతో 104 సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్, జెడీఎస్ లు సొంత ఎమ్మెల్యేలను కూడా నమ్మలేక హోటళ్ళు, రిసార్ట్స్ లో బంధించాయని తెలిపారు. అపవిత్ర పొత్తు కాంగ్రెస్, జెడీఎస్ లదే అని వ్యాఖ్యానించారు.

భరత్ అనే నేను సినిమాలో కూడా హీరో మహేష్ బాబు దగ్గర నుంచి ముఖ్యమంత్రి పదవిని ప్రకాష్ రాజు దక్కించుకుంటాడు. అయితే అప్పటికే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న భరత్ నే తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలంటూ ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల్లోని ప్రజలు ఒత్తిడి చేస్తారు. ప్రజల నుంచి ఒత్తిడి ఎదురవుతున్న విషయాన్ని సీఎం ప్రకాష్ రాజ్ కే చెప్పేస్తారు కొంత మంది. దీంతో ఆయన చేసేదేమీ లేక పదవి నుంచి దిగిపోతారు. అచ్చం భరత్ అనే నేను సినిమా తరహాలో ఎమ్మెల్యేలపై బిజెపికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి వచ్చేదని అమిత్ షా భావన. కానీ ప్రజలు ఎందుకో అలా చేయలేకపోయారు. ఓట్లు వేయటం కాకుండా మళ్లీ ఈ పని చేయాలా ఓటర్లు.

Next Story
Share it