కలెక్షన్లు కుమ్మేస్తున్న ‘రంగస్థలం’
వేసవిలో విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం ‘రంగస్థలం’ కలెక్షన్ల విషయంలో దుమ్మురేపుతోంది. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఫుల్ జోష్ లో ఉన్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో అయితే ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు 2 మిలియన్ డాలర్లు దాటాయి. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. విడుదలైన అతితక్కువ రోజుల్లోనే రెండు మిలియన్ల మార్క్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. రామ్ చరణ్ కు ఓవర్సీర్ మార్కెట్‌లో పెద్దగా పట్టు లేదనే వారికి ‘రంగస్థలం’ ద్వారా తన స్టామినా ఏంటో చూపించాడని అంటున్నారు. ధృవ సినిమాతో యూఎస్‌లో మిలియన్ డాలర్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
రంగస్థలం సినిమాకు మాత్రం యూఎస్‌లో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా సరే వసూళ్ళు ఈ రేంజ్ లో ఉండటానికి ప్రధాన కారణం సినిమాలోని దమ్మే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోమవారం నాడు కూడా సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ లు భారీ ఎత్తున ఉండటంతో ఈ సినిమా వసూళ్ళు రామ్ చరణ్ కెరీర్ లో ఓ రికార్డు సృష్టించటం ఖాయంగా కన్పిస్తోందని చెబుతున్నారు.