‘ప్రియా వారియర్’ మరో హల్ చల్
ఒక్క సారి సక్సెస్ వస్తే చాలు..అందరూ వాళ్ల వెంటే పడతారు. గ్లామర్ పరిశ్రమలో అయితే ఇది మరీ ఎక్కువ. సక్సెస్ జోష్ లో ఉన్న వారిని ఉపయోగించుకుని తమ కంపెనీల ‘బ్రాండింగ్’ పెంచుకోవాలని చూస్తారు. దీని ద్వారా తాము లబ్ది పొందేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఇది మార్కెట్ మంత్ర. అందరూ ఫాలో అయ్యేదే. అయితే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ‘ప్రియా వారియర్’ తనకు వచ్చే అవకాశాలు ఉపయోగించుకుని ముందుకెళుతోంది. ఇప్పుడు ఆమె ఏ కంపెనీకి ప్రచారం చేస్తే ఆ కంపెనీ ‘బ్రాండింగ్’ పెరగటం పక్కా ఖాయంగా కన్పిస్తోంది.
తాజాగా ఈ కుర్ర హీరోయిన్ ‘మంచ్’ చాక్లెట్ యాడ్ కు ప్రచారం చేస్తోంది. అందులోనూ ఓ సారి కన్ను గీటింది ఈ భామ. అంతే యూట్యూబ్ లో ఈ యాడ్ ట్రెండింగ్ లో నడుస్తోంది. మలయాళం, హిందీ సహా ఆరు భాషల్లో విడుదలవుతున్న ఈ ప్రకటనలో ప్రియ మరోసారి కన్నుగీటి కుర్రకారు మతి పోగొట్టింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రియ నటించిన ‘ఒరు ఆదర్ లవ్’ సినిమాలోని ఆమె కన్నుగీటుకి కుర్రకారు ఫిదా అయిన విషయం తెలిసిందే.