Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు..టీవీ9 రవిప్రకాష్, ఏబీఎన్ పై పవన్ కళ్యాణ్ ‘బ్లాస్ట్’

చంద్రబాబు..టీవీ9 రవిప్రకాష్, ఏబీఎన్ పై పవన్  కళ్యాణ్ ‘బ్లాస్ట్’
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు. కానీ ఇప్పుడు దొరలంటే మీడియా ఆసాములు. వారు చెప్పిందే వేదం. వారు పాడిందే నాదం.’అంటూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కూడా ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఛానళ్ళకు ఏపీకి ప్రత్యేక హోదా కంటే వ్యభిచారానికి చట్టబద్దత అంశం ఎక్కువైనట్లు కన్పిస్తోంది. మీ ప్రాధాన్యత ఏంటి? అని చంద్రబాబును ప్రశ్నించారు. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను లోకేష్ టీవీ5కి చెందిన సీనియర్ యాంకర్ సాంబశివరావును ఎంతో అప్యాయంగా అంకుల్ అని పిలుస్తారు. మహిళలను గౌరవిస్తామనే మీడియా ద్వంద ప్రమాణాలు చూడండి అంటూ టీవీ5కు చెందిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అంతే కాదు...తన రాజకీయ ప్రయత్నాలను ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో కూడా పలు ట్వీట్ల ద్వారా తెలిపారు పవన్. ‘వర్మ అనే దర్శకుడడు, శ్రీ సిటీ ఓనర్ (టీవీ9 ఓనర్) అయిన శ్రీనిరాజు (పది కోట్లు ఇఛ్చిన వ్యక్తి) టీవీ-9 రవిప్రకాష్ (మీడియా డిజైన్) వీరి ముగ్గురు ద్వారా మీ అబ్బాయి లోకేష్, అతని స్నేహితుడు అయిన రాజేష్ కిలారు కలసి పనిచేస్తున్నది మీకు తెలియదంటే నమ్మమంటారా? అంటూ చంద్రబాబును ఉధ్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.

మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు మీరు మాకిచ్చిన ప్రతిఫలం ఆంధ్ర్రప్రదేశ్ సెక్రటేరియట్ వేదికగా చేసుకుని మీ కొడుకు..అతని స్నేహితులు ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కొన్ని ఛానల్స్ తదితర సోషల్ మీడియా ద్వారా నా మీద, నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు. జరిపిస్తున్నారు. దాంట్లో భాగంగా గత కొద్ది రోజులుగా పది కోట్లు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయంలో నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా పచ్చి బూతు తిట్టించి, దానిని పదే పదే ప్రసారం చేసి..డిబెట్లు పెట్టి దానికి మీ పార్టీ వ్యక్తులు సర్కులేషన్ లో పెట్టారు. మీరు అందరూ కలసి ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ, మీ తల్లిదండ్రులకు, మీ అక్కచెల్లెళ్ళకు, మీ కూతుర్లకి, కోడళ్ళకి మీ ఇంటిళ్ళిపాదికి నా హృదయపూర్వక వందనాలు. అధికారంలో ఉన్న వాళ్ళకి, మీడియాని చేతుల్లోపెట్టుకున్న వాళ్ళకి అంగబలం, అర్థబలం ఉన్న వాళ్ళకి, వాళ్ళు చేసే అత్యాచారాలకి స్వశక్తితో జీవించే వాడు, ఆత్మగౌరవంతో బతికేవాడు ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే అసలు దేనికన్నా భయపడతాడా; వెనకంజ వేస్తాడా?. అని ప్రశ్నించారు.

Next Story
Share it