‘ఆఫీసర్’ టీజర్ వచ్చేసింది
BY Telugu Gateway9 April 2018 11:03 AM IST
X
Telugu Gateway9 April 2018 11:03 AM IST
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని హీరో పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శివ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విజయంపై నాగార్జున చాలా ధీమాగా ఉన్నారు. ఆఫీసర్ సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ లోగోను ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆఫీసర్ సినిమాలో నాగార్జున సీరియస్ పోలీసు పాత్రలో నటించినట్లు టీజర్ లో కన్పిస్తోంది.
https://www.youtube.com/watch?v=G438-UoqJCk
Next Story