Telugu Gateway
Cinema

కోపం వస్తే బూతులే వస్తాయి...మంత్రాలు రావు

కోపం వస్తే బూతులే వస్తాయి...మంత్రాలు రావు
X

ఇదీ అల్లు అర్జున్ కొత్త సినిమా నా పేరుసూర్య..నా ఇల్లు ఇండియా సినిమాలోని థియేట్రికల్ ట్రైలర్ లో డైలాగులు. ఈ సినిమా మే 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. అదీ విపరీతమైన కోపం ఉన్న అధికారిగా అల్లు అర్జున్ ఇందులో కన్పించబోతున్నాడు. శనివారం నాడు ఈ సినిమాకు సంబంధించి కొత్త ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ అదరగొట్టేలా ఉంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కు జోడీగా అను ఇమ్మాన్యూల్‌ నటిస్తోంది. ఈ సినిమాలో అర్జున్‌, శరత్‌కుమార్‌, బొమన్‌ ఇరానీ, నదియాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకూ సమ్మర్ లో వచ్చిన పెద్ద సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. రంగస్థలం, భరత్ అనే నేను..ఇప్పుడు నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

https://www.youtube.com/watch?v=ZnVIUr_BQSs

Next Story
Share it