Telugu Gateway
Andhra Pradesh

బ్రిటీషర్లకు బాబు వంగి వంగి దండాలు పెడతారా!

బ్రిటీషర్లకు బాబు వంగి వంగి దండాలు పెడతారా!
X

నిన్న మొన్నటి వరకూ ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టారు. మోడీ ఓ ప్రధాని. చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి. ఎవరి అధికార పరిధి వారిది. ఓ ముఖ్యమంత్రి..ప్రధాని ముందు ఇంతగా వంగి దండం పెట్టాల్సిన అవసరం లేదు. పోనీ ఏదో బిజెపి పాలిత రాష్ట్రంలో చేశారు అనుకుంటే...ఆ పార్టీ ప్రధాని కాబట్టి..పదవిని కాపాడుకోవటానికే..మరో ఉద్దేశంతోనే చేశారనుకోవచ్చు. ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదం ముందుకు తీసుకెళితే ..తాను ఆత్మవిశ్వాసం తెచ్చాను అని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు పలుమార్లు మోడీ ముందు అంతగా వంగి దండాలు పెట్టాల్సి వచ్చిందో. చంద్రబాబు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పటి బ్రిటీషర్లకు..ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏముందని వ్యాఖ్యానించి కలకలం రేపారు. అంతే కాదు..నేను తలచుకుంటే ఏపీలో కేంద్ర ప్రభుత్వ వాహనాలు తిరుగుతాయా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు ఏపీకి ఎన్నికైన ముఖ్యమంత్రి మాత్రమే. ఏపీ అనేది హెరిటేజ్ లాగా తన కుటుంబ సొంత కంపెనీ కాదు?.

విశాఖను హుద్ హుద్ తుఫాను ముంచెత్తినప్పుడు పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ ఆ సమావేశంలో చంద్రబాబును అసలు పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని అందుకు ప్రత్యక్ష సాక్షులైన అధికారులే చెప్పారు. అంతే కాదు..ఇలాంటి సందర్భాలు చంద్రబాబుకు ఎన్నో ఎదురయ్యాయి. అప్పుడెప్పుడూ మోడీ బ్రిటీషర్ కానప్పుడు...ఇప్పుడు ఆకస్మాత్తుగా చంద్రబాబుకు ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది. బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత పరుషమైన వ్యాఖ్యలు చేయలేదు కదా?. ఇటీవల వరకూ కేంద్ర మంత్రులుగా పనిచేసిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా బ్రిటీష్ ప్రభుత్వంలోనే పనిచేశారా?. ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బిజెపి, మోడీ సర్కారు మోసం చేసిందనే అభిప్రాయంలో ఏపీ ప్రజలందరూ ఉన్నారు.

ఇందులో రెండో మాటకు తావులేదు. కేంద్రం ఎక్కడ తన అవినీతి గుట్టురట్టు చేసి కేసుల్లో ఇరికిస్తుందనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటల్లో నియంత్రణ లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి..మంత్రులు విజయవాడ నడిరోడ్డులో ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ ‘సైకిల్ ర్యాలీ’ చేయవచ్చు. తర్వాత ఎంపీలు బస్సు యాత్రలు చేసుకోవచ్చు. కానీ హోదా సాధన సమితి బంద్ కు పిలిపిస్తే ..ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటారు. హోదా ఉద్యమంలో తాను తప్ప చాంఫియన్ ఎవరూ లేరనే ప్లాన్ లో భాగంగానే చంద్రబాబు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.

Next Story
Share it