‘ఐ డోంట్ నో ’ అంటున్న మహేష్ బాబు

మహేష్ బాబు కొత్త సినిమా భరత్ అను నేను సినిమాకు సంబంధించి మరో కొత్త పాట వచ్చేసింది. ఐ డోంట్ నో అంటూ సాగే ఈ పాటను చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం విడుదల చేసింది. కొరటాల శివ, కాంబినేషన్ లో తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ కొత్త పాటను బాలీవుడ్ స్టార్ ఫర్హాన్ అక్తర్ ఆలపించగా.. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యమందించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ విడుదలైన రెండు పాటలూ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవటం విశేషం.
ఫస్ట్ సాంగ్ తో పాటు ఆదివారం నాడు విడుదల చేసిన రెండవ పాటలోనూ ప్రేక్షకులకు ఏ మాత్రం జోష్ కన్పించటం లేదు. సినిమాల విజయంలో పాటలకు ఎంతో కీలక పాత్ర అన్న సంగతి తెలిసిందే. కానీ వరస పరాజయాల తర్వాత మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవటంతో మహేష్ బాబు అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారనే చెప్పొచ్చు. మరి సినిమా ఎలా ఉండబోతున్నది తెలియాలంటే ఏప్రిల్ 20 వరకూ వేచిచూడాల్సిందే.
https://www.youtube.com/watch?v=oiqqhuWYbvs
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT