Top
Telugu Gateway

హైదరాబాద్ నుంచే ‘భూకంపం సృష్టిస్తా’

హైదరాబాద్ నుంచే ‘భూకంపం సృష్టిస్తా’
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై తన వైఖరిని ప్రకటించారు. హైదరాబాద్ నుంచే ‘భూకంపం’ సృష్టిస్తానని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ వదిలిపోయే ప్రశ్నేలేదని..ఇక్కడి నుంచి ఎక్కడికైనా గంటన్నర ప్రయాణమే అన్నారు. దేశాన్ని ప్రగతిపథాన నడిపించటంలో కాంగ్రెస్, బిజెపిలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలను దేశం నుంచి పారద్రోలి అందరినీ అబ్బురపరిచేలా దేశ ప్రజలకు అభివృద్దిని అందిస్తామని ప్రకటించారు. మీరు ఇచ్చే స్పూర్తితో గతంతో ఏవిధంగానైతే ముందుకెళ్లామో...అదే విధంగా మీ దీవెనలతో దేశ రాజకీయాల్లో ప్రభావశీలంగా, క్రియాశీలంగా వ్యవహరించి తెలంగాణ గడ్డపేరున పలు నోళ్లు కొనియాడేవిధంగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట కాదు..తెలంగాణ గడ్డమీదే కాకుండా దేశం ఆత్మగౌరబావుట ఎగురవేయడానికి మీ సహకారంతో ముందుకెళతానని ప్రకటించారు.

దేశంలోనే అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా నడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. ప్రతి ఇంటికి లబ్దిచేకూరేలా మన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏరకమైన సహాయమైనా పారదర్శకంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని పనులు చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను ఏర్పాటు చేసి ...తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత కూడా టీఆర్ఎస్ దే. గతంలో అనేక పార్టీలకు గిరిజనులకు హామీలు ఇచ్చాయి కానీ అమలు చేయలేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం అమలు చేసింది. ఇక జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించుకోగలిగాం.పరిపాలన సంస్కరణలో భాగంగా పది జిల్లాలను 31 జిల్లాలను చేసుకున్నాం. ప్రజలకు జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి గతంలో ఇబ్బందులు పడేవారు. కానీ ఇఫ్పుడు ఆ కష్టాలు లేవన్నారు. దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా దూసుకెళుతుంటూ...దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మనల్ని అభినందిస్తుంటే ఇక్కడ కొన్ని పార్టీలు మనపై ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంత వస్తే అంత విమర్శలు చేస్తున్నారు.

ఈ మధ్య కొందరు చిల్లరమల్లర యాత్రలు పెట్టి విమర్శలు చేస్తున్నారు. నీకు టీపీసీసీ వచ్చిందంటే కారణం టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ల పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే రాష్ట్రం సిద్దించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారు. 150 గదులతోని కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు....సాయంత్రం ప్రగతి భవన్ కు రా....మీడియాను తీసుకొని రా...15 గదుల కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా నేను రాజీనామా చేస్తా. లేకుంటే నీ ముక్కు నేలకు రాస్తావా అని సవాల్ విసురుతున్నాను. మహారాష్ట్రం ఒప్పందం అప్పుడు ఇలాంటి విమర్శలు చేసారు. అప్పుడు రాజీనామా సవాల్ విసరితే పారిపోయారని ఎద్దేవా చేశారు.

Next Story
Share it