Telugu Gateway
Telangana

కర్ణాటకలో తెలుగువారంతా జెడీఎస్ కే ఓటేయ్యాలి

కర్ణాటకలో తెలుగువారంతా జెడీఎస్ కే ఓటేయ్యాలి
X

ఇది తెలంగాణ సీఎం కెసీఆర్ పిలుపు. ఆహ్వానిస్తే తాను ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కెసీఆర్ శుక్రవారం నాడు బెంగుళూరులో మాజీ ప్రధాని దేవగౌడ, ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎం కెసీఆర్ వెంట టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ప్రత్యేక విమానంలో బెంగుళూరు వెళ్ళి..ఈ చర్చల్లో పాల్గొన్నారు. దేశంలోని రైతాంగాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తాము ఓ సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని..ఓ ఏజెండాతోనే ముందుకెళతామని ఈ భేటీ అనంతరం కెసీఆర్ ప్రకటించారు. కావేరి సమస్య పరిష్కరించటానికి కేంద్ర ప్రభుత్వాలకు ఎంత సమయం కావాలని కెసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

దేశాభివృద్ధి కోసం ఎవరైనా తమతో కలవొచ్చని..తాము ఓపెన్ మైండ్ తో ఉన్నామని చెప్పారు. కేంద్రంలోని పాలకుల అసమర్థత వల్లే రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. రైతులు, సామాన్యుల మేలు కోసమే ఫ్రంట్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దానికి తన ఆశీస్సులు ఉంటాయని దేవేగౌడ చెప్పారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తైనా దేశం చాలా సమస్యలను జయించలేకపోయిందన్న మాట వాస్తవం. కీలకమైన అంశాల ప్రాతిపతికన జాతీయ స్థాయిలో ఫ్రంట్‌ అవసరం. కేసీఆర్‌ ప్రయత్నాలకు మేం అండగా ఉంటాం. ఆయన కార్యాచరణ బాగుంది. మున్ముందు కొన్ని నిర్ణయాలు తీసుకుని కలిసి నడవాలనుకుంటున్నాం’’ అని దేవేగౌడ మీడియాతో చెప్పారు. జాతీయ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై కెసీఆర్ తనతోపాటు..కుమారస్వామితో చర్చించారని దేవెగౌడ వెల్లడించారు.

Next Story
Share it