‘అదరగొట్టిన ఎన్టీఆర్’

అది సినిమాలు అయినా..బిగ్ బాస్ షో...అయినా ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ తెలుగుకు ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. స్టార్ టీవీ తరపున ఎన్టీఆర్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీని కోసం ఓ స్వల్పనిడివి ప్రచార చిత్రాన్ని కూడా రెడీ చేశారు. వివో ఐపీఎల్ తెలుగులో కూడా వస్తుందిరా..అంటే టీవీలో వస్తే చాలు కదా అంటే ...తెలుగులో ఏంటి స్పెషల్ అని ప్రశ్నిస్తాడు. తెలుగులో అయితే ఏంటా అంటూ ఎన్డీఆర్ ఫీల్డులోకి దిగుతాడు. ‘ కారం లేని కోడి. ఉల్లిపాయ లేని పకోడి. పెట్రోల్ లేని గాడి. మీసాల్లేని రౌడీ. పరిగెత్తడం రాని కోడి. ఆవకాయ్ లేని జాడీ. ఆటల్లేని బడి. అమ్మప్రేమ లేని ఒడి. అసలు మజా తెలుగురా’ అంటూ ఎన్డీఆర్ చెప్పే డైలాగు అదిరిపోతుంది. ఈ సందర్బంగా స్టార్ టీవీ ప్రతినిధులు, జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడారు. తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ మంగళవారం పార్క్‌హయత్ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. క్రీడలకు సరిహద్దులు లేవన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా క్రీడల్లోనే మాట్లాడుకోవచ్చని తెలిపారు.
ఇక క్రికెట్ అయితే మన రక్తంలో చేరి నరనరాల్లో జీర్ణీంచుకుపోయిందన్నారు. పెద్ద వాళ్లు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను కూడా పంచారన్నారు. చిన్నప్పుడు తన తండ్రితో క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడినని తెలిపారు. . ప్రచారకర్తగా తనకు అవకాశం కల్పించిన స్టార్ యాజమాన్యానికి ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. స్టార్ మా రూపోందించిన ప్రచార వీడియోలో ఎన్టీఆర్ తెలుగు ఐపీఎల్ ప్రత్యేకత ఏమిటో వివరించాడు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ.. సచిన్ తన అభిమాన క్రికెటర్ అని, క్రికెటర్ల జీవితాలపై సినిమాలు రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే క్రికెటర్ల బయోపిక్స్ చేయడానికి తాను సాహసించనని తెలిపారు.
https://www.youtube.com/watch?v=bIOpP1qC5Jw