ఎన్టీఆర్..చరణ్ సినిమా బడ్జెట్ 300 కోట్లు
టాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ సినిమాకు రంగం సిద్ధం అయింది. ఎప్పటిలాగానే ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కేంచేది కూడా దర్శకధీరుడు రాజమౌళినే. భారీ బడ్జెట్ సినిమాలతో రాజమౌళి టాలీవుడ్ లో బాహుబలి రెండు భాగాలను నిర్మించిన సంగతి తెలిసిందే. త్వరలో డీ వీవీ దానయ్య నిర్మాతగా తెరకెక్కే కొత్త మల్టీస్టారర్ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలుగా నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఆర్ ఆర్ ఆర్ అంటూ వర్కింగ్ టైటిల్‌ను ప్రకటించింది చిత్రయూనిట్. ఇంత కాలం సినిమా బడ్జెట్ 100, 150 కోట్ల వరకు అంటూ రకరకాల ప్రచారం జరిగింది.
అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఆర్ ఆర్ సినిమాను 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు దానయ్య. మహేష్ బాబు హీరోగా దానయ్య నిర్మించిన భరత్ అనే నేను సినిమా ప్రమోషన్ సందర‍్భంగా ఈ విషయాలను బహిర్గతం చేశారు. ‘మల్టీ స్టారర్ సినిమాను కథను రాజమౌళి నాతో పాటు మరికొందరు సాంకేతిక నిపుణులకు చెప్పారు. ఇప్పటికే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాము. సెట్స్ కోసం ఆర్ట్ డైరెక్టర్ పని మొదలు పెట్టినట్లు తెలిపారు.