Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ‘కఠిన’ కసరత్తులు

ఎన్టీఆర్ ‘కఠిన’ కసరత్తులు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ప్రతి సినిమాలో విభిన్నంగా కన్పించటానికి ప్రయత్నిస్తారు. ఇది అంత తేలికైన అంశం కాదు. ఇలా కన్పించటానికి ఎంతో కసరత్తు చేయాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా వరస హిట్లతో దూసుకెళుతున్న ఈ హీరో కొత్త సినిమా కోసం చాలా కఠినమైన కసరత్తులు చేస్తున్నారు. ఈ ఫోటో చూస్తే చాలు అది ఎంత కఠినంగా ఉందో తెలుసుకోవటానికి. ఎన్టీఆర్ తన ట్రైనర్ తో కలసి చేస్తున్న కసరత్తుల ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం కఠోరశ్రమ చేస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో ఈ కసరత్తు సాగుతుంది. ఎన్టీఆర్ తాజా కసరత్తుల ఫోటోను లాయిడ్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత మరో హీరో రామ్ చరణ్ తో కలసి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా చేయనున్నారు.

Next Story
Share it