Telugu Gateway
Cinema

మహాటీవీ..సంధ్యపై జీవిత ఫైర్

మహాటీవీ..సంధ్యపై జీవిత ఫైర్
X

నటి జీవితా రాజశేఖర్ మహాటీవీ ఛానల్, మహిళా సంఘ నేత సంధ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. అంతే కాదు...ఆమె మహాటీవీ, సంధ్యపై జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విషయంలో తాను ఎంతదూరమైనా వెళతానని...ఇందులో పురోగతి లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. వీరిని వదిలిపెట్టే ప్రశ్నేలేదన్నారు. మహిళల హక్కులను సంరక్షిస్తామని చెప్పే సంధ్య ఇలాంటివి ఎలా మాట్లాడతారని జీవిత ప్రశ్నించారు. తన గురించి, తన కుటుంబం గురించి ఏమీ ఆధారాలు లేకుండా ఎలా లైవ్ లో మాట్లాడతారని అడిగారు. ‘సంధ్య మీకు భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు.. డివోర్స్ అనుకుంటాను. మీకు అత్త, మామలు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఈ విషయాన్ని నేను అప్పుడే వదలన’ని హెచ్చరించారు. ‘సంధ్య నాపై ఓ ఛానెల్‌లో అవాస్తవాలు మాట్లాడింది. అందుకే నన్ను అభిమానించే వాళ్లందరికి తెలియాలనే మీడియా ముందుకొచ్చాను. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది. సెలబ్రెటి కుటుంబాల గురించి సంధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేస్తున్నారని నన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారు? సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు.

అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉంది. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్క సారి మోసపోతారు, పదేళ్లు మోసపోతుంటే ఏం చేస్తున్నారు. పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఇలానే ఉంటారనేది తప్పు’ ‘కాస్టింగ్‌ కౌచ్‌ వలనే మేము హీరోయిన్‌లు అయ్యాము అంటే తప్పు. మేము 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాం. మాకు ఎప్పుడు కాస్టింగ్‌ కౌచ్‌ ఎదురు కాలేదు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ చూసి ఆమెను ఎవరైనా మోసం చేశారు అంటే నమ్ముతారా? అమ్మాయిల కోసమే ఫిల్మ్ ఆఫీసులు తీసిన వాళ్ళు ఉన్నారు. వేషాలు ఇస్తామని మోసం చేస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు. పరిశ్రమకు గౌరవం ఇస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతో మంది ఇంట్లో నుంచి పారిపోయి పరిశ్రమలోకి వచ్చిన వారిని ఇళ్లకు పంపించా. పరిశ్రమలోని ప్రతి మహిళలకు నేను అభ్యర్థిస్తున్నా వచ్చి మాట్లాడండి. దాసరి నారాయణరావు వంటి వారు లేని లోటు పరిశ్రమలో స్పష్టంగా కన్పిస్తోంది.

Next Story
Share it