Telugu Gateway
Top Stories

కర్ణాటకలో హంగ్!

కర్ణాటకలో హంగ్!
X

కర్ణాటకలో రాజకీయం కొత్త మలుపులు తిరరనుందా?. ఇఫ్పటివరకూ కాంగ్రెస్ గెలుపు పక్కా అని కొన్ని సర్వేలు ప్రకటించగా..ఇప్పుడు ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటి కర్ణాటక అసెంబ్లీలో హంగ్ రానుందట. ఇండియా టుడే. కార్వే ఒపీనియన్ పోల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. అధికార కాంగ్రెస్ కు 90-101 సీట్లు రావచ్చని అంచనా. బిజెపికి 78-86 సీట్లు రావొచ్చని సర్వేలో తేలింది.

జెడీఎస్ కు 34-43 సీట్లు వచ్చే అవకాశం. ప్రభుత్వ ఏర్పాటులో జెడీఎస్ ది కీలక పాత్ర అయ్యే అవకాశం కన్పిస్తోంది. 33 శాతం మంది సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఇంత కాలం కాంగ్రెస్ పార్టీ తిరిగి స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని అంచనాలు వెలువడ్డాయి. తాజా సర్వే ఫలితాలు కాంగ్రెస్ లో ఒకింత ఆందోళన కలిగించ అవకాశం ఉంది.

Next Story
Share it