Telugu Gateway
Movie reviews

‘ఏ మంత్రం వేసావే’ మూవీ రివ్యూ

‘ఏ మంత్రం వేసావే’ మూవీ రివ్యూ
X

విజయ్ దేవరకొండ. టాలీవుడ్ లో దూకుడు మీద ఉన్న హీరో. పెళ్లిచూపులు..అర్జున్ రెడ్డి సినిమాలు సూపర్ హిట్ కావటంతో ఈ హీరో సినిమా అంటే సహజంగానే యూత్ లో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ తరుణంలో విజయ్ హీరోగా నటించిన ‘ ఏ మంత్రం వేసావే’ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శివానీ సింగ్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించింది. అయితే ఏ మంత్రం వేసావే సినిమాతో విజయ్ దేవరకొండ విజయాలకు బ్రేక్ పడినట్లు అయింది. ప్రస్తుతం యూత్ సోషల్ మీడియాలో పడి ఎలా కొట్టుకుపోతున్నది..దారితప్పుతున్నది..మానవ సంబంధాలు ఎలా దెబ్బతింటున్నదీ చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కోసం ఎంచుకున్న లైన్ మాత్రం ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగానే ఉన్నా కానీ..సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకూ టేకింగ్ మొదలుకుని అన్నీ పూర్ స్టాండర్ట్స్ తోనే ఉన్నాయి.

అసలు ఏ మంత్రం వేసావే ను సినిమా అనే కంటే డాక్యుమెంటరీ తరహాలో ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా ప్రేక్షకుడు తాము సినిమా చూస్తున్నామనే ఫీల్ కూడా పొందడు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ సినిమాలో హీరో విజయ్ బయటి లోకాన్ని వదిలేసి..ఇంట్లో కూర్చుని నిత్యం వీడియో గేమ్ లు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటాడు. తల్లితండ్రులు బయటిలోకాన్ని చూడమని..అసలు బయటికే పోకపోతే ఎలా అని అభ్యంతరం వ్యక్తం చేసినా..విజయ్ అలా వారాల తరబడి ఇంట్లోనే ఆన్ లైన్ లో గేమ్స్ పోటీలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటాడు.

అదే సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయిలను లవ్ పేరుతో మోసం చేస్తుంటాడు. ఆ క్రమంలోనే శివానీ సింగ్ తో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలోనే గేమ్స్ వదిలేసి బయట ప్రపంచంలోకి వస్తాడు. మరి వీరిద్దరి ప్రేమ సక్సెస్ అయిందా? లేదా వెండితెరపై చూడాల్సిందే. శివానీ సింగ్ కూడా ఆన్ లైన్ గేమింగ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఈ సినిమాలో ఒక్క విజయ్ నటన తప్ప..మిగిలిన గురించి చెప్పుకోవటానికి పెద్దగా ఏమీ లేదు. మొత్తానికి ఈ సినిమా చూడటానికి సాహసం చేయకపోవటమే బెటర్.

రేటింగ్. 1.25/5

Next Story
Share it