Telugu Gateway
Cinema

సన్నీలియోన్ జీవితచరిత్రతో వెబ్ సిరీస్

సన్నీలియోన్ జీవితచరిత్రతో వెబ్ సిరీస్
X

ప్రముఖుల జీవితాలు తెరకెక్కటం చాలా కాలం నుంచే మొదలైంది. చారిత్రక నేపథ్యంతోనూ పలు సినిమాలు తెరపై సందడి చేస్తున్నాయి. అయితే సన్నీలియోన్ తాను మాత్రం ఏ తక్కువా? అంటూ తన జీవిత చరిత్రను తెరకెక్కించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఇది సినిమా రూపంలో కాకుండా..వెబ్ సిరిస్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సన్నీలియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్. అయితే కరణ్ జీత్ కౌర్ సన్నీలియోన్ గా ఎలా మారింది..దీని వెనక ఉన్న కారణాలు ఏమిటి అన్నది ఈ వెబ్ సిరీస్ లో చెప్పబోతున్నదన్న మాట. అయితే కొద్ది రోజుల క్రితం అసలు దేశంలో సన్నీలియోన్ సినిమాలు నిషేధించాలంటే కొన్ని చోట్ల ఉద్యమాలు కూడా నడిచాయి. క్రికెట్ గురించి తెలుసుకుందామని..పిల్లలు ఎవరైనా సునీల్ గవాస్కర్ నిక్ నేమ్ సన్నీ అని టైప్ చేయగా..సన్నీలియోన్ పేరు..ఫోటోలు కుప్పలు..తెప్పలుగా వచ్చేవి.

దీంతో చిర్రెత్తికొచ్చిన పేరెంట్స్ దీనిపై ఉద్యమమే చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందనుకోండి..అది వేరే విషయం. కొత్తగా తెరకెక్కనున్న వెబ్ సిరీస్ కు సన్నీలియోన్ అసలు పేరు ‘కరణ్ జీత్’ నే టైటిల్ గా నిర్ణయించారు. సన్నీలియోన్ కెనడాలో శృంగార తారగా కెరీర్ ప్రారంభించి..బిగ్ బాస్ ద్వారా బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రత్యేక గీతాలతోనూ ఆమె చాలా పాపులర్ అయింది. అయితే సన్నీ పాత్రలో ఎవరు నటిస్తారనే అంశంపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి సన్నీలియోన్ జీవిత చరిత్రతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ యూ ట్యూబ్ లో రికార్డులు నమోదు చేయటం ఖాయం. ఎందుకంటే ఆమెకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.

Next Story
Share it